మగాడికి తగినంత వీర్య కణాలు లేనపుడు వేరొకరి వీర్యంతో పిల్లలు కనే అవకాశం ఉండటం మనకు టెక్నాలజీ కల్పించిన ఓ సదవకాశం. టెక్నాలజీకి ఎప్పుడూ రెండు కోణాలుంటాయి. రెండో కోణం ఓ చెన్నై జంటలో కనిపించింది.
ఈజీ మనీ కోసం ఐడియాలు వేసే వారిని చాలా మంది చూస్తుంటాం కానీ… ఓ చెన్నై జంట నీచానికి దిగజారి ఈజీ బ్రిలియంట్ బేబీ కోసం ప్రయత్నం చేస్తోంది. ఉన్నత మేధస్సు కలిగిన బిడ్డకు జన్మనివ్వడం కోసమంటూ ఆ చెన్నైదంపతులు ఒక హీనమైన ఆలోచన చేశారు. తాము కృత్రిమ గర్భధారణ ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నామని, దీనికోసం ఐఐటీ విద్యార్థి వీర్యం కావాలని ఆన్‌లైన్‌లో ప్రకటించారు. ఎవరైనా దొరకని రక్తం కోసమో, అవయవాల కోసమో ఇలా ఇస్తారు. వీరు పుట్టే కొడుకుని ఖర్చు పెట్టి తెలివైన వాడిగా పెంచడం చాలా కష్టం అనుకున్నారో ఏమో, ఏకంగా తెలివైన శిశువునే కనేద్దాం అనుకున్నారు. అంతేకాదు, అందరు ఐఐటీ విద్యార్థుల వీర్యం వీరికి వద్దట.. కేవలం అందమైన, పొడవైన, చురుకైన, ఆరోగ్యకరమైన, చెడు అలవాట్లు లేని ఐఐటీ విద్యార్థి వీర్యం మాత్రమే కావాలట. ఇంతకు మించిన చోద్యం ఏమైనా ఉంటుందా?
తాము కోరుకున్న లక్షణాలు గల విద్యార్థి వీర్యానికి రూ.20 వేలు చెల్లిస్తామన్నారు. ఈ ప్రకటన చూసిన చెన్నై ఐఐటీ విద్యార్థుల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల్లో సంచలనం అయ్యింది ఈ వార్త.
చట్టంలో శిక్షలు లేని ఇలాంటి సంఘటనల గురించి మనం ఆలోచించాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి